డ్రగ్స్ వాడకం, అమ్మకం రెండూ నేరమే అయినా, కొందరు తెలిసి కూడా ఈ తప్పు చేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో అమాయకులు కూడా ఈ ఉచ్చులో చిక్కుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్ పాతబస్తీకి చెందిన ఓ మహిళ, బ్యాంకాక్ ట్రావెల్ ఏజెంట్ మోసంతో దుబాయ్‌లో గంజాయి అక్రమ రవాణా కేసులో ఇరుక్కుంది. దీంతో దుబాయ్ కోర్టు ఆమెకు 25 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఆమె కుటుంబ సభ్యులు మాత్రం ఆమె అమాయకురాలని తనను విడిపించేందుకు సాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.