సివిల్స్ పరీక్ష అంటేనే ఓ యుద్ధం. ఎంతో కష్టపడినా ఉద్యోగం రాకపోతే కొందరు మానసికంగా కుంగిపోయి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంటారు. తాజాగా కామారెడ్డిలో ఇలాంటి ఘటనే జరిగింది. సివిల్స్ కోసం ఏళ్ల తరబడి చదివిన ఓ మహిళ, తాను కలెక్టర్ అయ్యాననే భ్రమలో ఆఫీసుకు వెళ్లి అధికారులను పరుగులు పెట్టించింది. నకిలీ ఐఏఎస్ సర్టిఫికెట్లతో కామారెడ్డి కలెక్టర్ వద్దకు వచ్చిన మహిళ రచ్చ చేసింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ వివరాలు..