పార్టీ కోసం లక్షల్లో ఖర్చు.. అప్పులు, ఈఎంఐల ఒత్తిడి.. బీఆర్ఎస్‌ మండల అధ్యక్షుడి మృతి

2 hours ago 1
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం గుళ్లకోటకు చెందిన బీఆర్ఎస్‌ మండల అధ్యక్షుడు సింహాచలం జగన్‌ ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పులు, రుణ వాయిదాల భారం కారణంగా కొంతకాలంగా తీవ్ర ఒత్తిడికి గురైనట్లు ఆయన లేఖలో పేర్కొన్నారు. ఆర్‌ఎంపీ వైద్యుడిగా సేవలందించిన జగన్‌ గతంలో సర్పంచ్‌గా పనిచేశారు. అనంతరం బీఆర్ఎస్‌లో వివిధ బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. కుటుంబాన్ని ఆదుకోవాలని బంధువులు, స్నేహితులు, పార్టీ నాయకులను కోరారు.
Read Entire Article