బాసర అమ్మవారి ఆలయానికి కొత్త రూపు.. జోరుగా పునర్నిర్మాణ పనులు

1 hour ago 1
బాసర శ్రీజ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. టెండర్లు పూర్తికావడంతో గుత్తేదారులు పనులు ప్రారంభించారు. పుష్కరాల నాటికి పనులు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించడంతో పది నెలల్లో నిర్మాణాలను పూర్తి చేసేలా అధికారులు ప్రణాళిక రూపొందించారు. ప్రధాన ఆలయం, క్యూకాంప్లెక్స్‌, కోనేరు, ప్రసాదం కౌంటర్లు, గెస్ట్‌హౌస్‌, గోశాల తదితర నిర్మాణాలు చేపట్టనున్నారు. గోదావరి తీరంలో రూ.20 కోట్లతో పుష్కర ఘాట్ల అభివృద్ధి కూడా ప్రారంభమైంది. పాత ప్రభుత్వ, ఆలయ భవనాలను తొలగించి కొత్త మౌలిక వసతులు కల్పించనున్నారు.
Read Entire Article