మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరుడికి విలువైన కానుక.. రూ.35 లక్షల నాగాభరణం సమర్పించిన భక్తుడు

1 hour ago 1
కృష్ణా జిల్లా మోపిదేవిలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయానికి రూ.35 లక్షల విలువైన 220 గ్రాముల బంగారంతో తయారు చేసిన నాగాభరణాన్ని భక్తులు సమర్పించారు. ఘంటసాల మండలం కొడాలికి చెందిన తుమ్మల లక్ష్మీసుజాత, ఆమె కుమారులు శ్రీనివాసకిరణ్‌, శివతరుణ్‌ కలిసి ఈ ఆభరణాన్ని తయారు చేయించారు. హైదరాబాద్‌ మాదాపూర్‌లో నివసిస్తున్న దాతలు ఆలయానికి వచ్చి నాగాభరణాన్ని అందజేశారు. ప్రధానార్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తమ కోరిక నెరవేరడంతో స్వామివారికి ఈ కానుక సమర్పించినట్లు లక్ష్మీసుజాత తెలిపారు.
Read Entire Article