హైదరాబాద్‌లో గణేశ్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా భక్తుల సౌకర్యార్థం టీజీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేసింది. ఖైరతాబాద్ మహాగణపతి, బాలాపూర్ గణేశ్ మండపాల దర్శనానికి ఈ నెల 14 నుంచి 24 వరకు ప్రత్యేక బస్సులు నడుస్తాయి. జేబీఎస్ నుంచి ఉదయం 6 గంటలకు తొలి సర్వీస్ ప్రారంభమై రాత్రి 9:55 వరకు ప్రతి 40 నుంచి 50 నిమిషాలకు బస్సులు అందుబాటులో ఉంటాయి. బాలాపూర్ నుంచి తిరుగు సర్వీసులు ఉదయం 7:55 నుంచి రాత్రి 11:50 వరకు కొనసాగుతాయి. భక్తులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని ఆర్టీసీ సూచించింది.