తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు తితిదే ఈసారి హైటెక్ భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. భక్తుల రద్దీ నేపథ్యంలో కమ్యూనికేషన్‌కు అంతరాయం లేకుండా జియో నెట్‌వర్క్ స్లైసింగ్ సాంకేతికతను, గ్యాలరీల్లో భక్తుల సంఖ్యను లెక్కించేందుకు ఏఐ ఆధారిత హెడ్ కౌంటింగ్ కెమెరాలను వినియోగించనుంది. తోపులాటలను నివారించేందుకు కొత్త ఎగ్జిట్ ప్లాన్, 3,000 కెమెరాలతో పర్యవేక్షణ, 40 విజిలెన్స్ బృందాలు, 5,300 మంది సిబ్బందితో బందోబస్తు, ప్రత్యామ్నాయ పార్కింగ్, ప్రత్యేక ఫ్యాక్ట్ చెక్ సెల్ ఏర్పాటు చేస్తున్నారు.