ఆంధ్రప్రదేశ్‌లోని నాలుగు గ్రామ పంచాయతీలకు జాతీయ అవార్డులు దక్కాయి. దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్ కార్యక్రమంలో భాగంగా వివిధ విభాగాల్లో ఏపీలోని నాలుగు గ్రామ పంచాయతీలకు జాతీయ అవార్డులు వరించాయి. అనకాపల్లి జిల్లాలోని రెండు పంచాయతీలకు, అలాగే చిత్తూరు, ఎన్టీఆర్ జిల్లాలలోని ఒక్కో గ్రామ పంచాయతీకి అవార్డులు దక్కాయి. దీనిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోం మంత్రి వంగలపూడి అనిత అధికారులను అభినందించారు. ప్రభుత్వ పాలనకు ఇది నిదర్శనమని ట్వీట్ చేశారు.