తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 1000 రోజుల పాలన పూర్తిచేసుకుంది. ఈ నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షం భారత రాష్ట్ర సమితి (BRS).. ప్రభుత్వ పాలన వైఫల్యాలపై ప్రత్యక్ష పోరాటం చేయాలని నిర్ణయించుకుంది. ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్అ అధ్యక్షతన ఆదివారం బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆయన కీలక సూచనలు చేశారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కాబోతున్నాయి.