హైదరాబాద్ ప్రజలకు ప్రభుత్వం తీపికబురు వినిపించింది. మెట్రో - ఆర్టీసీ ఉమ్మడి పాస్ విధానం త్వరలోనే అమలు చేయనుంది. ఇందుకు సంబంధించిన కార్యాచరణ ప్రారంభించింది. ఇందులో భాగంగా తెలంగాణ సీఎస్ సంజయ్ జాజు సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మెట్రో ఆర్టీసీ ఉమ్మడి పాస్ విధానం వెంటనే అమలయ్యేలా చూడాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. ఛార్జీలను త్వరగా ఖరారు చేసి.. ఈ విధానం అమలు చేయాలని సూచించారు.