శ్రీవారిమెట్టు మార్గంలో రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్ భక్తులకు గాయాలు

2 hours ago 1
తిరుపతి శ్రీవారిమెట్టు మార్గంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చంద్రగిరి మండలం శ్రీవారిమెట్టు మార్టంలో కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో హైదారాబాద్‌కు చెందిన ముగ్గురు భక్తులు గాయపడ్డారు. హైదరాబాద్ చింతల్ ప్రాంతానికి చెందిన కుటుంబం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం.. కాణిపాకం వెళ్తున్న సమయంలో వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు గాయపడగా.. స్థానికులు వెంటనే సమీప ఆస్పత్రికి తరలించారు.
Read Entire Article