పిఠాపురం నియోజకవర్గంలోని మహిళలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శ్రావణ మాసం కానుక అందించారు. పదివేల మంది మహిళలకు చీరలు, పసుపు, కుంకుమలు పంపిణీ చేశారు. పిఠాపురంలోని పురుహూతిక అమ్మవారి సన్నిధిలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టారు. అలాగే భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతంలో పాల్గొన్న మహిళలకు పసుపు, కుంకుమతో పాటుగా చీరలు పంపిణీ చేశారు.