పిఠాపురం వర్మకో పదవి.. ఎట్టకేలకు కరుణించిన అధిష్టానం..

4 months ago 26
పిఠాపురం నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జి ఎస్వీఎస్ఎన్ వర్మకు పార్టీపరంగా పదవి కేటాయించింది తెలుగుదేశం పార్టీ అధిష్టానం. బుధవారం రోజున పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీలను టీడీపీ ప్రకటించింది. నారా లోకేష్‌ను టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించారు. ఈ క్రమంలోనే టీడీపీ ఏపీ ఉపాధ్యక్షులుగా 16 మందికి అవకాశం ఇచ్చిన అధిష్టానం.. పిఠాపురం వర్మకు కూడా స్థానం కేటాయించింది. అయితే ఎన్నికల సమయంలో పిఠాపురం వర్మకు ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి పార్టీలో సముచిత స్థానం కేటాయించారు.
Read Entire Article