పిఠాపురంలో కలెక్టర్‌పై బూతులతో రెచ్చిపోయిన కాంట్రాక్టర్

1 month ago 3
పిఠాపురంలో సోమవారం జరిగిన గ్రీవెన్స్‌లో కాకినాడ కలెక్టర్ షన్మోహన్.. పలువురి నుంచి ఆర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఓ కాంట్రాక్టర్ తనకు బిల్లులు రావడం లేదంటూ కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు. ఎన్నిసార్లు ఆర్జీలు పెట్టుకున్నా బిల్లులు మాత్రం మంజూరు చేయడం లేదని ఆరోపించాడు. ఈ సమయంలో కలెక్టర్.. మీరు రావక్కర్లేదని బిల్లులు మంజూరవుతాయని సర్దిచెప్పారు. ఈ క్రమంలో ఆయనతో వాగ్వాదానికి దిగగిన కాంట్రాక్టర్ దేవానం రెచ్చిపోయాడు. కలెక్టర్‌ను నోటికొచ్చినట్టు తిట్టాడు. ‘నన్ను రావద్దని చెప్పడానికి నువ్వు ఎవరు? నా బిల్లులు నాకు ఇచ్చేయండి.. ఆ యూ**** ఫెలో అంటూ’ నోటికి పనిచెప్పాడు. దీంతో పోలీసులు అతడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. బయటకు లాక్కెళ్లారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన బిల్లులు సరిగాలేవంటూ మున్సిపల్ కమిషనర్ అభ్యంతరం వ్యక్తం చేయడంతోనే కలెక్టర్ అతడికి వివరించే ప్రయత్నం చేశారు. కానీ, కాంట్రాక్టర్ మాత్రం నోరు పారేసుకున్నాడi.
Read Entire Article