Pithapuram 100 Beds Hospital: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. సొంత నియోజకవర్గం పిఠాపురం ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు.. పిఠాపురంలో ఉన్న 30 పడకల కమ్యూనిటీ ఆస్పత్రిని ప్రభుత్వం 100 పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేసింది. ఈ మేరకు ఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పిఠాపురంలోని ఆస్పత్రి వసతుల కల్పనకు ప్రభుత్వం రూ.38.32 కోట్లు విడుదల చేసింది.