పీఏ సంధు జగదీష్ వ్యవహారంపై ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత స్పందించారు. ఆదివారం విశాఖపట్నం సెంట్రల్ జైలును వంగలపూడి అనిత సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడిన అనిత.. వైసీపీ హయాంలో శాంతిభద్రతలను గాలికి వదిలేశారని విమర్శించారు. విశాఖ సెంట్రల్ జైలులో గంజాయి వాడుతున్నారనే ఆరోపణలు వచ్చాయన్న ఆమె.. విశాఖ సెంట్రల్ జైలులో జరుగుతున్న ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామన్నారు. ఇప్పటికే కొంతమంది అధికారులపై చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. పీఏ జగదీష్‌ను పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించానని.. తీరు మారకపోవటంతో తీసేసినట్లు చెప్పారు.