కోలీవుడ్ ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్ గా, నటుడిగా, నిర్మాతగా రాణిస్తున్న యంగ్ హీరో జీవీ ప్రకాష్ కుమార్. విభిన్నమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తున్న ఆయన తాజాగా ''కింగ్స్టన్'' మూవీతో థియేటర్లలోకి రావడానికి సిద్ధమవుతున్నారు. ఫస్ట్ సీ అడ్వెంచర్ ఫ్యాంటసీ మూవీగా రూపొందుతున్న ఈ మూవీలో 'బ్యాచిలర్' తరువాత మరోసారి దివ్యభారతి, జీవీ ప్రకాష్ జంటగా కనిపించబోతున్నారు.