Puttaparthi Man Arrested After 26 Years For Killed Son: 1998లో 6 నెలల వయసున్న కొడుకును తండ్రి చంపేసి పూడ్చి పెట్టి పారిపోయాడు. ఆ కేసు అప్పటి నుంచి పెండింగ్‌లోనే ఉంది.. నిందితుడు దొరకలేదు. అయితే కర్మ ఎవరినీ విడిచిపెట్టదు అన్నట్లు 26 ఏళ్ల తర్వాత నిందితుడు పోలీసులకు దొరికిపోయాడు. ఓ పెళ్లి పత్రిక ఆధారంగా పోలీసులు నిందితుడ్ని గుర్తించి అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాలు ఇలా ఉన్నాయి.