పులివెందులలో కొడితే.. రాష్ట్రమంతా మోగాలి సౌండ్ : వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

1 hour ago 3
పులివెందుల సభలో మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని జగన్ మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా అధికారుల తీరును ఆయన దుయ్యబట్టారు. ఈ సందర్భంగా తిరగబడండి.. మీ అన్న మీకు తోడుగా ఉంటానని తన పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పులివెందులలో కొడితే.. రాష్ట్రమంతా సౌండ్ రావాలని అన్నారు. మూడేళ్లు గడిచిపోయాయని, వచ్చే రెండేళ్లు కాస్త ఓపిక పట్టాలని కార్యకర్తలకు వైఎస్ జగన్ సూచించారు. ఆ తర్వాత రాబోయేది జగన్ 2.0 అని అన్నారు.
Read Entire Article