పుష్ప 2 టీమ్‌పై తీన్మార్ మల్లన్న ఫిర్యాదు.. ఆ సీన్‌పై అభ్యంతరం..

1 month ago 5
అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 సినిమాలో ఓ సీన్ మీద అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. సినిమాలోని సీన్ పోలీసులను కించపరిచేలా ఉందంటూ మేడిపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పుష్ప 2 హీరో అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్, నిర్మాతలపై చర్యలు తీసుకోవాలని తీన్మార్ మల్లన్న కోరారు. స్విమ్మింగ్ పూల్ వద్ద చిత్రీకరించిన ఆ సీన్.. పోలీసులను అగౌరవపరిచేలా ఉందని.. వారిని కించపరిచేలా ఉందని తీన్మార్ మల్లన్న ఆరోపించారు.
Read Entire Article