మాజీ మంత్రి అంబటి రాంబాబు అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. విలేకర్లతో మాట్లాడుతున్న సమయంలో అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. పుష్ప సినిమాతో అల్లు అర్జున్ హాలీవుడ్ రేంజుకు ఎదిగారని అంబటి రాంబాబు కొనియాడారు. అదే కొందరికి జెలసీగా మారిందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అందరి మాదిరిగానే పుష్ప 2 కోసం తాను కూడా ఎదురుచూస్తున్నానని చెప్పారు. ఎవరు ఎన్ని దుష్ప్రచారాలు చేసినా పుష్ప 2 మూవీని అపలేరని.. అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడిని అడ్డుకోలేరంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా బాగుంటే జనం తప్పకుండా చూస్తారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.