పుష్ప-2పై జనసేన నేత యూటర్న్.. నాగబాబు దెబ్బ గట్టిగానే తగిలినట్టుంది!

1 month ago 5
పుష్ప-2 సినిమా విడుదల సమయంలో సోష‌ల్ మీడియా వేదిక‌గా మ‌రోసారి మెగా, అల్లు ఫ్యాన్స్ మ‌ధ్య వార్ మొద‌లైంది. ఈ క్రమలో కృష్ణాజిల్లా గన్నవరానికి చెందిన జనసేన నేత చలమలశెట్టి రమేశ్ బాబు... న్నీపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మెగా ఫ్యామిలీ అండంతో ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చావని, కానీ,ఇప్పుడు వారి ప్రస్తావన కూడా తీసుకురాకపోవడం శోచనీయమని ఆరోపించారు. ఇప్ప‌టికైనా బ‌న్నీ త‌న తీరు మార్చుకుని చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబుల‌కు క్షమాపణలు చెప్పాలని.. లేదంటే పుష్ప 2 సినిమా విడుద‌ల‌ను అడ్డుకుంటామ‌ని హెచ్చరించారు. అయితే, దీనిపై జనసేన నాయకుడు, నటుడు నాగబాబు క్లాస్ పీకడంతో ఆయన యూటర్న్ తీసుకున్నారు. తమ పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు సూచన మేరకు వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఎవరి వృత్తులకు, వ్యాపారాలకు జనసేన అడ్డుపడదన్న సందేశాన్ని నాగబాబు ఇచ్చారన్నారు.
Read Entire Article