మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు పాస్‌పోర్ట్ ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. ట్రయిల్ కోర్టులో ఎన్‌వోసీ తెచ్చుకుంటేనే ఇవ్వాలని పాస్‌పోర్ట్ అథారిటీకి కీలక ఆదేశాలు జారీ చేసింది. తనపై ఉన్న క్రిమినల్ కేసుల నేపథ్యంలో పాస్‌పోర్ట్ అథారిటీ తనకు పాస్‌పోర్ట్ ఇవ్వడంలేదని మంత్రి అడ్లూరి ఇటీవల హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ పిటిషన్ విచారణకు రాగా.. తప్పనిసరిగా ట్రయల్ కోర్టు నుంచి ఎన్వోసీ తెచ్చుకోవాలని న్యాయస్థానం సూచించింది.