పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని బాలికల వసతి గృహంలో బాలికతో నగ్నపూజలకు యత్నించిన ఘటన కలకలం రేపింది. వసతి గృహంలో పనిచేసే వంట మనిషి.. నగ్న పూజలు చేస్తే కనకవర్షం కురుస్తుందని ఓ పదో తరగతి బాలికకు మాయ మాటలు చెప్పింది. దీంతో ఆ విద్యార్థిని భయంతో హాస్టల్ నుంచి మంథని పట్టణంలో ఉన్న తమ బంధువుల ఇంటికి వెళ్లి జరిగిన విషయాన్ని చెప్పగా.. ఘటన వెలుగులోకి వచ్చింది.