పెన్షన్ల పంపిణీ.. ఓ లబ్దిదారుని ఇంట్లో కాఫీ పెట్టిన సీఎం

3 weeks ago 4
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఒకరోజు ముందుగానే లబ్దిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేపట్టింది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం నాడు పల్నాడు జిల్లా యల్లమంద గ్రామంలో పలువురికి పింఛన్లు అందజేశారు. తొలుత లబ్దిదారు శారమ్మ ఇంటికి వెళ్లి. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. శార‌మ్మ కుటుంబ స‌భ్యుల‌ను ఆప్యాయంగా ప‌ల‌క‌రించి.. వారితో ముచ్చటించారు. ఆ కుటుంబంతో మాట్లాడి, సమస్యలు అడిగి తెలుసుకుని తమ ప్రభుత్వంలో అందరికీ న్యాయం చేస్తామని సీఎం భరోసా ఇచ్చారు. బాగా చదువుకోవాలని శారమ్మ పిల్లలకు సూచించారు. చురుకుగా ఉన్నార‌ని, బాగా చదివితే మంచి స్థాయికి వస్తార‌ని వారిని ఆశీర్వదించారు. అనంత‌రం రూ.4 వేల పింఛన్ ను స్వయంగా చంద్రబాబు అందజేశారు.
Read Entire Article