హైదరాబాద్ కేపీహెచ్‌బీ కాలనీలో రాజేశ్వరి అనే వివాహిత అదృశ్యమైంది. భర్త శివకుమార్ ఆమెను 'పెరుగు తింటే లావు అవుతావు' అని అన్నందుకు మనస్తాపం చెంది ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. భర్త సరదాగా అన్న మాటలను సీరియస్‌గా తీసుకున్న రాజేశ్వరి ఎవరికీ చెప్పకుండా అదృశ్యం అయింది. దీంతో ఆమె కోసం బంధువుల ఇళ్లలో వెతికినా ఫలితం లేకపోవడంతో భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న కేపీహెచ్‌బీ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా విచారణ చేపట్టారు.