ప్రభుత్వ సంతాన సాఫల్య కేంద్రాలు పేద దంపతులకు లక్షల ఖర్చు లేకుండా చికిత్స అందిస్తున్నాయి. ఇందులో భాగంగా వరంగల్‌లోని సీకేఎం ఆస్పత్రిలో ఏర్పాటైన ఐవీఎఫ్ కేంద్రం (IVF Centre) సత్ఫలితాలు ఇస్తోంది. ప్రైవేటు ఆస్పత్రులు అధిక ఫీజులతో దోపిడీకి పాల్పడుతున్న వేళ.. ఈ కేంద్రానికి తాకిడి పెరుగుతోంది. మార్చిలో ప్రారంభమైనప్పటి నుంచి ప్రతి నెలా సగటున వంద మంది ఇక్కడ ఉచిత చికిత్స పొందుతున్నారు. అయితే.. వైద్య సిబ్బంది కొరత కారణంగా వస్తున్న ఇబ్బందులను దంపతులు తెలియజేస్తున్నారు.