తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి, ఆంధ్రప్రదేశ్ యాదవ కార్పొరేషన్ ఛైర్మన్ నరసింహ యాదవ్ తనయుడి పెళ్లికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు.విజయవాడ నుంచి రేణిగుంటకు బయలుదేరిన సీఎం నారా చంద్రబాబు నాయుడు.. తూకివాకం సమీపంలోని ఆర్పీఆర్ కల్యాణ మండపం వద్దకు చేరుకుని వివాహ వేడుకకు హాజరయ్యారు. వేడుకలో అందరినీ ఆప్యాయంగా పలకరించారు చంద్రబాబు. అనంతరం కొత్త జంటను ఆశీర్వదించారు.