అనధికారిక పేకాట క్లబ్బులు నిర్వహిస్తున్నారని ఆరోపిస్తూ.. ఓ వ్యక్తి హైకోర్టులో పిల్ వేశాడు. అయితే, అతడు తన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలను సమర్పించకపోవడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు టైమ్‌ను వేస్ట్ చేయడమే కాదు.. కేవలం పబ్లిసిటీ స్టంట్‌తో ఇలాంటి పిటిషన్ వేశారని చీవాట్లు పెట్టింది. అంతటితో ఆగకుండా మళ్లీ ఇలాంటి తప్పుడు పిటిషన్లు వేయకుండా బుద్ది వచ్చేలా జరిమానా విధించింది. ఇటీవల ఈ కేసులో తీర్పు వెలువరించింది.