హైదరాబాద్‌లోని సైనిక్ పురికి చెందిన దుర్గా దాది అనే గృహిణి, 'పేటీఎం మనీ'లో పెట్టుబడి పెడితే భారీ లాభాలు వస్తాయని నమ్మిన శివకృష్ణ అనే వ్యక్తి చెప్పిన మాటలు విని మోసపోయింది. తొలుత స్వల్ప లాభం రావడంతో నమ్మి.. ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) స్కీమ్‌లో ఏకంగా రూ. 51.5 లక్షలు వరకు పెట్టుబడి పెట్టింది. లాభాన్ని విత్‌డ్రా చేయడానికి ప్రయత్నించగా.. మోసగాళ్లు లోన్ చెల్లించమని డిమాండ్ చేశారు. దీంతో తాను మోసపోయానని గ్రహించి.. ఆమె నేరేడ్‌మెట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.