ఇందిరమ్మ ఇండ్ల పథకంపై మంత్రి తుమ్మల కీలక అప్డేట్ ఇచ్చారు. సంక్రాంతి నుంచి లబ్ధిదారులను ఎంపిక చేస్తామన్నారు. కొత్త ఏడాదిలో పేదలకు ఇండ్లు నిర్మించనున్నట్లు తెలిపారు. కాగా, లబ్ధిదారుల ఎంపికకు ఇప్పటికే ప్రత్యేక యాప్ ప్రారంభించగా.. 500 ఇండ్లకు ఒక సర్వేయర్‌ను సైతం నియమించారు.