ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలును రేవంత్ సర్కార్ వేగవంతం చేసింది. ఇప్పటికే ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా సర్వేయర్లు ప్రతి ఇళ్లు తిరిగి యాప్‌లో వివరాలు నమోదు చేస్తున్నారు. సంక్రాంతిలోపు ఆ ప్రక్రియ పూర్తి చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు. అదే సమయంలో పథకాన్ని వేగంగా అమలు చేసేందుకు 33 జిల్లాలకు ప్రత్యేకంగా ప్రాజెక్టు డైరెక్టర్లను నియమించేందుకు సిద్ధమయ్యారు.