వైసీపీ శ్రేణులకు సాయం చేస్తే పాముకు పాలుపోసినట్టేనన్న సీఎం నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలకు వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి కౌంటరిచ్చారు. చంద్రబాబు అలా మాట్లాడడం సిగ్గు చేటని భూమన విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన ఓ ఒక్క హామీ అమలు చేయని వ్యక్తి చంద్రబాబని మండిపడ్డారు. రెండున్నర లక్షల కోట్లు పేదలుకు పంచిన వ్యక్తి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని.. పేదలకు మంచి చేశాడు కనుకే జగన్‌కు 40శాతం ఓట్లు వచ్చాయన్నారు. ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి 9 నెలలు అయినప్పటికీ ప్రజలకు ఏం చేశారని ప్రశ్నించారు. వైసీపీ పట్ల ప్రజల్లో సానుభూతి వ్యక్తం అవుతోందన్న భూమన..టీడీపీకి ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు.