గతేడాది నవంబరులో జరిగిన ఎన్నికల్లో గెలిచి.. తొలిసారి తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది కాంగ్రెస్ పార్టీ. ఎన్నికల్లో ఆ పార్టీ పలు హామీలను గుప్పించింది. మహిళలకు ఫ్రీ బస్సు, గ్యాస్ సిలిండర్లు, ఉచిత కరెంట్ పథకాన్ని ఇప్పటికే అమల్లోకి తీసుకొచ్చింది. అలాగే, రైతు రుణ మాఫీ కూడా పూర్తయ్యింది. ఈ నేపథ్యంలో మరో కీలక పథకమైన ఇందిరమ్మ ఇండ్లను పేదలకు అందజేయనుంది. ఇందుకు కోసం విధివిధానాలను త్వరలోనే విడుదల చేయనున్నట్టు సమాచారం.