పేదల జీవితాలను మెరుగుపరచడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం "పీ4" కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. తాజాగా, ఈ కార్యక్రమంపై కోనసీమ జిల్లాల్లో ఏర్పాటు చేసిన సభలో సీఎం నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రధాని మోదీ, పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్నారని, పింఛను మొత్తాన్ని పెంచుతామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా గేట్స్ ఫౌండేషన్‌తో కలిసి పనిచేస్తామని, అన్ని ఆసుపత్రుల్లోని రోగుల వివరాలు సేకరించి ఏఐతో అనుసంధానం చేస్తామని చెప్పారు.