తెలంగాణలో మరోసారి ఉగ్రవాదుల కదలికలు కలకలం సృష్టిస్తున్నాయి. ఇప్పటివరకు హైదరాబాద్, కరీంనగర్ లాంటి కొన్ని ప్రదేశాల్లోనే ఉగ్ర కదలికలు కనిపిస్తుండగా.. ప్రస్తుతం వరంగల్‌లో కూడా ఉగ్రవాదులకు సంబంధించిన కలదలికలున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతుండటమే కాదు.. పోలీసులు ఓ వ్యక్తిని అరెస్టు కూడా చేయటం సర్వత్రా ఆందోళనకరంగా మారింది.