వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఒక విచిత్రమైన దొంగ పట్టుబడ్డాడు. ఇతను కేవలం హీరో కంపెనీకి చెందిన స్ప్లెండర్, ఫ్యాషన్ ప్లస్ మోడల్ బైక్‌లనే లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నాడు. ఏడాదిలో 18 బైక్‌లను దొంగిలించి, వాటిని తక్కువ ధరకు అమ్మేసి జల్సాలు చేసేవాడు. పోలీసులు అతన్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.