ఎస్ఎల్‌బీసీ ఘటనలో సహాయక చర్యలు చేపట్టడంలో తెలంగాణ ప్రభుత్వం దారుణంగా విఫలమైందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. దాదాపు ఐదు రోజులు పూర్తవుతున్నప్పటికీ సహాయక చర్యలు కనీసం ప్రారంభం కాలేదన్నారు. వివిధ ఏజెన్సీల మధ్య సమన్వయాన్ని సాధించడంలో కూడా ప్రభుత్వం ఫెయిల్ అయిందన్నారు. మంత్రులు అక్కడికి వెళ్లి హెలికాప్టర్లలో టీవీ ఇంటర్వ్యూలు ఇవ్వడానికి పోటీ పడుతున్నారు తప్ప, సహాయక చర్యలు చేపట్టడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యారన్నారు. పైనుంచి హెలికాప్టర్‌లో చూస్తే సొరంగం లోపల ఏమన్నా కనిపిస్తాదా? ప్రత్యేకంగా చూడడానికి వీఎక్స్ రే కెమెరాలు ఉన్నాయా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.