ఏపీలోని పొగాకు రైతులకు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఊరట కలిగించే వార్త వినిపించారు. కేంద్ర ప్రభుత్వంతో చర్చించి పొగాకు రైతులకు రెండేళ్ల పాటు రూ.50 వేలు చొప్పున వడ్డీలేని రుణం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. అలాగే లోగ్రేడ్ పొగాకు రైతులకు క్వింటాల్‌కు రూ.1000 చొప్పున అదనపు సాయం అందిస్తామని.. త్వరలోనే అర్హులైన వారి బ్యాంక్ ఖాతాలలో డీబీటీ విధానంలో నేరుగా జమ చేస్తామని వివరించారు.