పొదుపు చర్యలు.. చంద్రబాబు కీలక నిర్ణయం.. ఆన్‌లైన్‌లోనే..

2 hours ago 1
ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఏపీ ప్రభుత్వం పొదుపు చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీ ఏటా ప్రతిష్టా్త్మకంగా నిర్వహించే మహానాడును ఈసారి ఆన్‌లైన్‌లో నిర్వహించాలని చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం అమరావతిలో ఉన్న టీడీపీ కేంద్ర కార్యాలయంలో వేదిక ఏర్పాటు చేయాలని.. పార్టీ నేతలకు చంద్రబాబు సూచించారు. మరోవైపు ఆన్‌లైన్‌లో మహానాడు నిర్వహణలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 1,845 క్లస్టర్లలో ప్రత్యేక స్క్రీన్లు ఏర్పాటు చేయనున్నారు. పొలిట్‌ బ్యూరో సభ్యులు ఎన్టీఆర్‌ భవన్‌ నుంచి మహానాడులో పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు మే 27, 28, 29వ తేదీలలో నెల్లూరు జిల్లాలో మహానాడు నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్న సంగతి తెలిసిందే.
Read Entire Article