అసెంబ్లీలో బుధవారం డ్రంక్ అండ్ డ్రైవ్ వ్యవహారం చర్చకు దారితీసింది. రాష్ట్రంలో రహదారుల అంశంపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతుండగా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్‌రావు తన సీటులో నుంచి లేచి డ్రంకెన్ డ్రైవ్ గురించి మాట్లాడారు. కొంత మంది సభ్యులు పొద్దున్నే తాగి సభకు వస్తున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొంతమంది సోయి లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. అంతేకాదు, అసెంబ్లీలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టు పెడతారా? అని ప్రశ్నించారు. దీంతో హరీష్ వ్యాఖ్యలపై సభలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య వెంటనే స్పందిస్తూ... బహుశా హరీష్‌రావు.. ప్రతిపక్ష నేత తాగి ఫాంహౌస్‌లో పడుకుని ఉండొచ్చని కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలో అధికార-విపక్షాల మధ్య చిన్నపాటి గందరగోళం చోటు చేసుకుంది. అగ్గిపెట్టి హరీష్‌రావు ఇలా మాట్లాడట సరికాదని, వాటిని రికార్డుల నుంచి తొలగించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు డిమాండ్ చేశారు.