రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీనివాస కాలనీలో ఓ మూట కలకలం రేపింది. పొద్దుపొద్దున్నే నడిరోడ్డుపై ఓ మూట కనిపిస్తే.. అందులో ఏముందని భయం భయంగానే విప్పి చూస్తే.. ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆ మూటలో ఓ మహిళా మృతదేహం కనిపించగా.. ఆమె ముక్కు, చెవులు కోసేసి ఉండటం మరింత షాకింగ్‌కు గురి చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని.. కేసు నమోదు చేసుకుని.. క్లూస్ టీంతో కలిసి దర్యాప్తు చేస్తున్నారు.