హైదరాబాద్‌లోని ఇన్ఫోసిస్ ఆఫీసు సమీపంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతున్న ఎనిమిది మందిని పోచారం పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, నిందితుల వద్ద నుంచి కారు, బైక్‌లు, పూజ సామగ్రి, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కష్టపడకుండా డబ్బు సంపాదించాలనే దురాశతో వీరు ఈ పని చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇన్ఫోసిస్ లాంటి దిగ్గజ ఐటీ కంపెనీ దగ్గర ఇలాంటి తవ్వకాలు వెలుగు చూడటం స్థానికంగా సంచలనంగా మారింది.