నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. సెల్‌ఫోన్ దొంగతనం చేసిందనే అనుమానంతో పదేళ్ల బాలిక ముఖంపై అట్లకాడతో వాతలు పెట్టారు. ఇందుకూరుపేట మండలం కుడితిపాళెం గ్రామంలో ఈ అమానుష ఘటన జరిగింది. జ్యోతిష్యుడు చెప్పాడని నాగరాజు అనే వ్యక్తి, అతని కుటుంబ సభ్యులు ఈ దారుణానికి ఒడిగట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి బాలికకు మెరుగైన వైద్యం అందించాలని, ఆమె చదువు బాధ్యత తీసుకుంటామని తెలిపారు.