నగర పోలీసు శాఖ.. మతపరమైన దీక్షలపై కఠిన ఆదేశాలు జారీ చేసింది. పోలీసు సిబ్బంది విధి నిర్వహణలో ఉండి అయ్యప్ప దీక్ష వంటి మతాచారాలు చేయకూడదని సూచించింది. ఎవరైనా దీక్షలో ఉంటే సెలవులు తీసుకోవాలని తెలిపింది. ఈ నిబంధనలను ఉల్లంఘించిన ఎస్సై కృష్ణకాంత్‌కు మెమో జారీ చేసింది. అయితే ఈ ఆదేశాలపై రాజాసింగ్, వీహెచ్‌పీ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కేవలం హిందువులకే ఇలాంటి ఆంక్షలు ఎందుకని వారు ప్రశ్నిస్తున్నారు.