నాగర్‌కర్నూల్ జిల్లాలో అమానుష ఘటన వెలుగు చూసింది. లింగాల పోలీస్‌స్టేషన్‌లో ముగ్గురు యువకులకు ఎస్సై శిరోముండనం చేయించడం కలకలం రేపుతోంది. ఓ కేసు విషయంలో ముగ్గురు యువకులకు స్టేషన్‌కు వెళ్లగా.. అక్కడ పోలీసుల ముందు యువకుడు తల దువ్వుకున్నాడని ఎస్సై జగదీష్ శిరోముండనం చేయించాడు. ఈ ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.