రేషన్ బియ్యం కేసులో మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో జయసుధ ఏ1గా ఉండగా.. విచారణకు రావాలంటూ పోలీసులు మంగళవారం నోటీసులు ఇచ్చారు. దీంతో బుధవారం మధ్యాహ్నం జయసుధ ఆర్. పేట పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు. న్యాయవాదులతో కలిసి జయసుధ విచారణకు రాగా.. పోలీసులు న్యాయవాదులను లోనికి అనుమతించలేదు. మరోవైపు పేర్ని జయసుధ విచారణకు హాజరయ్యే క్రమంలో ఆమె వచ్చిన కారుపై చర్చ జరుగుతోంది. మచిలీపట్నం మేయర్ కారులో జయసుధ విచారణకు రావటంపై చర్చ జరుగుతోంది.