గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీని విజయవాడ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్డు పోలీస్ కస్టడీకి అనుమతించింది. మరింత విచారణ కోసం వల్లభనేని వంశీని పది రోజులు పోలీస్ కస్టడీకి అప్పగించాలంటూ పోలీసులు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ విచారించిన ఎస్సీ, ఎస్టీ కోర్టు మూడు రోజులు పోలీస్ కస్టడీకి అనుమతించింది. దీంతో రేపటి నుంచి ఫిబ్రవరి 27 వరకూ వంశీని పోలీసులు విచారించనున్నారు. మరోవైపు వల్లభనేని వంశీకి వెస్ట్రన్ టాయిలెట్, బెడ్ ఏర్పాటు చేయాలని కోర్టు ఆదేశించింది.