పోలీస్ స్టేషన్‌లో ధర్నా.. ఎరక్కపోయి ఇరుక్కున్న అంబటి రాంబాబు

1 month ago 4
మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ నేత అంబటి రాంబాబుకు బిగ్ షాక్ తగిలింది. గుంటూరులోని పట్టాభిపురం పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. డిసెంబరు 18న మాజీ మంత్రి అంబటి రాంబాబు తన అనుచరులతో కలిసి పట్టాభిపురం పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. టీడీపీ, జనసేన సోషల్ మీడియా పోస్టులపై ఫిర్యాదు చేసిన. అనంతరం తన ఫిర్యాదులపై ఎప్పటి లోపు చర్యలు తీసుకుంటారో చెప్పాలని పోలీసులు డిమాండ్ చేశారు. పోలీసుల తీరును నిరసిస్తూ వాగ్విదానికి దిగిన అంబటి.. స్టేషన్ మెట్లపై అనుచరులతో కూర్చుని ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. దీంతో పోలీసుల విధులకు అంటకం కలిగించారని అంబటి రాంబాబుపై పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు. అంబటి రాంబాబుపై కేసు నమోదు కాగా.. ధర్నాకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఎరక్కపోయి ఇరుక్కుపోయిన మాజీమంత్రి అంబటి రాంబాబు అంటూ సెటైర్లు వేస్తున్నారు.
Read Entire Article