Posani Krishna Murali Remand 14 Days: సినీనటుడు పోసాని కృష్ణ మురళికి షాక్ తప్పలేదు. రైల్వే కోడూరు కోర్టు పోసానికి 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ మేరకు రైల్వే కోడూరు మెజిస్ట్రేట్ నిర్ణయం తీసుకున్నారు. కోర్టులో రాత్రి 9.30 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఇరుపక్షాల వాదనలు నడిచాయి. అనంతరం కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. బుధవారం రాత్రి ఆయన్ను పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు.